ఉద్యమ సాధనలో జేఏసీ పాత్ర కీలకం

by Sridhar Babu |
ఉద్యమ సాధనలో జేఏసీ పాత్ర కీలకం
X

దిశ, హుస్నాబాద్ : తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జేఏసీ పోషించిన పాత్ర కీలకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం స్థానికంగా జేఏసీ నాయకులు ఏర్పాటుచేసిన అభినందన సభలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను జేఏసీ నాయకులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించి వాటిని త్వరితగతిన పూర్తి చేస్తానన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... గత పది సంవత్సరాలలో ఆర్థిక విధ్వంసం జరగడంతో ఖజానా కుంటుపడిందని, ఆలోచన కుందేలు లా ఉంటే రాష్ట్ర ఖజానా తాబేలు లా ఉందని అన్నారు.

అయినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రభుత్వం ముందుకు పోతుందని, అలాగే టౌన్ కోసం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పూర్తిచేస్తానన్నారు. ఆనాడు శంకుస్థాపన చేసిన గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులు సామరస్య పూర్వకంగా భూసేకరణ చేయకపోవడం వల్లే ఆలస్యం అయిందని, కాలువలు పూర్తి చేస్తామన్నారు. డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సులు తేవడం జరుగుతుందన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో నియోజకవర్గ సమస్యలను నెరవేర్చి రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు బాధ్యత నెరవేరుస్తానని అన్నారు. అనంతరం జేఏసీ నాయకులు మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు.

Advertisement

Next Story