- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్ని శాఖల పనితీరు సంతృప్తికరం
దిశ, సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది అన్ని శాఖల పనితీరు సంతృప్తికరంగా ఉందని మల్టీజోన్-2 ఐజీ వి.సత్యనారాయణ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన వార్షిక తనిఖీల్లో భాగంగా సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సివిల్ తగాదాల్లో తల దురిస్తే వేటే
జిల్లాలో ఎవరైనా పోలీసు అధికారులు సివిల్ తగాదాల్లో తల దూర్చి సెటిల్మెంట్లు చేస్తే వారిపై వేటు తప్పదని ఐజీ సత్యనారాయణ తీవ్రంగా హెచ్చరించారు. అయితే కొన్ని విషయాల్లో ఇంకా కొంత మంది ఎస్సైలు, సీఐల పనితీరు ఇంకా మెరుగుపరుచుకోవాల్సి ఉందని వారికి చెప్పడం జరిగిందన్నారు.
హైవేలపై ఉన్న దాబాల్లో ప్రత్యేకంగా నిఘా
సంగారెడ్డి జిల్లా మీదుగా ఉన్న హైవేలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అర్ధరాత్రిలు, తెల్లవారు జామున వరకు దాబాలు తెరిచి ఉండడం వల్ల ఇతర ప్రాంతాలకు చెందిన నేరస్తులు ఇక్కడ నేరాలు చేసి వెళ్ళిపోతున్నారని తమ దృష్టికి వచ్చినట్టు చెప్పారు. వీటిని నియంత్రించేలా ప్రత్యేక చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇక పోతే ప్రధానంగా గంజాయి, పిడిఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, జూదం వంటి వాటిపై ఉక్కుపాదం మోపెలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా మిస్సింగ్ కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలను ఐజీ వివరించారు. ఇందులో 80 శాతం వరకు వారిని ట్రేస్ చేసి కేసు పరిష్కరించినట్లు చెప్పారు. మైనర్లు, ఇతర మేజర్లు ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని ఇల్లు విడిచి వెళుతున్న వారి మిస్సింగ్ కేసులే ఇందులో అధికంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
సంతోషంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోండి
నూతన సంవత్సరం గిఫ్ట్ అంటే కుటుంబ సభ్యులు మధ్య మంచి వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడమేనని ఐజీ అన్నారు. రాత్రిళ్ళు తాగి రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తమ ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. యువత ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్, పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ డివిజన్ ల డిఎస్పీలు పాల్గొన్నారు.