- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతులకు సీఎం కేసీఆర్ అండ.. మంత్రి హరీశ్ రావు
దిశ, సిద్దిపేట ప్రతినిధి : అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని గింజ కూడా మిగలకుండా సేకరిస్తామని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పత్తి మార్కెట్ యార్డులో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాల ధాన్యం తడిసిపోయిందని మహిళా రైతులు మంత్రికి గోడు వెలిముచ్చారు. మంత్రి మాట్లాడుతూ..తడిసిన ధాన్యానికి సైతం మామూలు వరిధాన్యానికి చెల్లించిన ధరనే చెల్లిస్తామని భోరసానిచ్చారు. అన్నదాతలకు కష్టల్లో అండగా నిలువడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
ప్రతి సంవత్సరం అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటున్న నేపథ్యంలో యాసంగి పంట మార్చినెలఖరు లోపు కోతలు జరిగేలా. ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేసి ఆదిశగా రైతులకు చైతన్యం చేసేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సిద్ధిపేట టూ షోలాపూర్‌కు డీలక్స్ బస్సు సర్వీస్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అదే విధంగా సిద్ధిపేట నుంచి హైదరాబాద్ కు 5 డీలక్స్ బస్సులు వచ్చే వారం, పది రోజుల్లో ప్రారంభించనున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అదే విధంగా రాబోయే రోజుల్లో గొందియాకు కూడా డీలక్స్ బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ రోజాశర్మ, ఆర్టీసీ ఆర్ఏం సుదర్శన్, సిద్ధిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.