- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TGRTC: సంక్రాంతికి ఆర్టీసీ సర్వం సిద్ధం.. ఛార్జీలు ఎలా ఉన్నాయో తెలుసా?
దిశ, తెలంగాణ బ్యూరో: సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెల్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు, టీజీఎస్ ఆర్టీసీ అధికారులు బుధవారం తెలిపారు. ఈ పండుగకు 6, 432 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించిందన్నారు. ప్రధానంగా ఈ నెల 10, 11, 12 తేదిల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి స్తాయిలో చేసినట్టు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతుందన్నారు. ఇప్పటికే రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయాలు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. సంక్రాంతి పండుగ కోసం నడిపే ప్రత్యేక బస్సుల కోసం రూ.1.50 వరకు టిక్కెట్ ధరలను పెంచుకునే అవకాశాన్ని ఇచ్చినట్టు ఆర్టీసీ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
అయితే, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన ఛార్జీలు వర్తిస్తాయన్నారు. తిరుగు ప్రయాణాల్లో రద్దీ ఎక్కువగా ఉండే 19,20 తేదీల్లో మాత్రమే పెంచిన చార్జీలు అమలులో ఉంటాయన్నారు. రెగ్యూలర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏ మాత్రం లేనప్పటికీ, రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరితగతిన సంస్థ వెనక్కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లను చేసినట్టు అధికారులు వెల్లడించారు. స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీడిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలు సవరించుకునేందుకు ప్రభుత్వం గతంలోనే అవకాశం కల్పించిందన్నారు. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని అధికారులు సూచించారు.