Minister Ponnam Prabhakar : రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకోవద్దు

by Aamani |
Minister Ponnam Prabhakar : రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకోవద్దు
X

దిశ,హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) పోతారం (ఎస్) లోని ఆర్ కే జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ (Collector) మను చౌదరితో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం పత్తి తేమ శాతాన్ని పరిశీలించి తూకం వేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… హుస్నాబాద్ ప్రజలకు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. పట్టణంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరఫున పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైందని, కాటన్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశనలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పర్యవేక్షణ లో దేశవ్యాప్తంగా కాటన్ కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. పత్తి మద్దతు ధర పత్తి కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉంటాయని, మౌలిక వసతుల కల్పన అడ్మినిస్ట్రేషన్ సహకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కాటన్ కార్పొరేషన్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యం వల్ల రైతులకు నష్టం జరుగుతుందనే విషయం దృష్టికి వచ్చిందని ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు.

కేంద్రంలో ఉన్న రాష్ట్ర ప్రతినిధులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కోరేదేమంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 322 పత్తి కొనుగోలు కేంద్రాల్లో వెంటనే పత్తి కొనుగోలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడ కూడా రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకునే పరిస్థితి రావద్దని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు రైతులకు సంబంధించిన పత్తి కొనుగోలు క్రయ విక్రయాలు ఎక్కడ ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాలు పెంచాలన్నారు. సెప్టెంబర్ వరకు పత్తి కొనుగోలు కొనసాగుతుందని రైతులు ఎవరూ తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దన్నారు.

పత్తిలో తేమ శాతం 8 లోపు ఉంటే రూ.7500 ధర ఉంటుందని, పత్తి ని సంచులలో నింపుకు రాకుండా ఓపెన్ గా ఆటోలో, ట్రాక్టర్, వ్యాన్ లో తీసుకురావాలని రైతులకు తెలియజేశారు. కనీస తేమ శాతాన్ని పాటించి ఆర్థికంగా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలన్నారు. ధాన్యం పత్తి కొనుగోలు కి సంబంధించి ఎక్కడ ఇబ్బంది కలగొద్దని అన్ని రకాలుగా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజు ఎన్ని కేంద్రాలు ఓపెన్ అయ్యాయి ఎంత కొనుగోలు జరిగింది అనే విషయాలపై మానిటరింగ్ జరుగుతుందని గ్రామాలలో రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలిగిన ప్రభుత్వ అధికారులతో స్థానిక నాయకులు చర్చించి రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత తీసుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed