- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయాయి
by Shiva |
X
నడిరోడ్డుపై ఆందోళనలకు దిగిన మృతుడి కుటుంబ సభ్యులు
దిశ, చేర్యాల/మద్దూరు: దూల్మిట్ట మండల పరిధిలోని రెడ్యానాయక్ తండాకు చెందిన ధారవత్ కోటేష్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మరణించాడు. దీంతో మృతదేహాన్ని పరిశీలించిన మద్దూరు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేర్యాలకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన భర్త ప్రాణాలు పోయాయంటూ.. విద్యుత్తు అధికారులకు సమాచారం ఇవ్వకుండా మృతుడిని పోస్టుమార్టంకి తీసుకెళ్లడంపై మద్దూరు పోలీసులపై కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. మృతుడి భార్య, కుటుంబ సభ్యులు చేర్యాల రహదారిపై రాస్తారోకోకు దిగారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ధారవత్ కోటేష్ ప్రాణాలు కోల్పోయాడని విద్యుత్ అధికారులు వచ్చి తమకు న్యాయం చేసేంత వరకు పోస్టుమార్టం చేసేందుకు వీలు లేదంటూ ఆందోళనకు దిగారు.
Advertisement
Next Story