కాంగ్రెస్ పార్టీనే బీఆర్ఎస్ మెనిఫెస్టోను కాఫీ కొట్టింది : మంత్రి

by Naresh |   ( Updated:2023-10-16 14:57:24.0  )
కాంగ్రెస్ పార్టీనే బీఆర్ఎస్ మెనిఫెస్టోను కాఫీ కొట్టింది : మంత్రి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించి, విలేఖరులతో మాట్లాడారు. ఆనాడు ఓటు నోటుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసిద్ది అయితే..నేడు సీటుకు నోటు కాంగ్రెస్ పార్టీ నినాదం అని ఎద్దెవ చేశారు. పదికోట్లకు, ఐదు ఎకరాల భూమికి టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగానే మాట్లాడుకుంటున్నారన్నారు. ఇలాంటి వాళ్లకు రాష్ట్రాన్ని అప్పజెపితే రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటారన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజల హృదయాలు ఉప్పొంగి పోతుంటే..ప్రతిపక్షాల గుండెలు జారీపోతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీనే బీఆర్ఎస్ మెనిఫెస్టోను కాఫీ కొట్టిందన్నారు. నమ్మకానికి మారుపేరు సీఎం కేసీఆర్ అయితే నయవంచనకు మారు ప్రతిపక్షాలని మండిపడ్డారు. ప్రతి పక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన కేసీఆరే హ్యాట్రిక్ సీఎం అని ధీమా వ్యక్తం చేశారు. రైతు బీమా తరహాలో ప్రవేశ పెట్టిన కేసీఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా లభించనుందన్నారు. సౌభాగ్య లక్ష్మీ పేరిట అర్హులైన మహిళలకు రూ.3 వేలు, గ్యాస్ సిలిండర్ రూ.400, అన్నపూర్ణ పేరిట రేషన్ షాప్ లల్లో సన్నబియ్యం పంపిణీ, ఆసరా ఫించన్ రూ.5 వేలు, వికలాంగుల ఫించన్ రూ.6 వేలు లాంటి సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ బాధ్యతాయుతంగా మెనిఫెస్టో రుపొందించారన్నారు. బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికలల్లో పోటీకి బయపడి పార్లమెంట్ ఎన్నికలల్లో పోటీ చేస్తామని అంటుంటే..ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, రాజనాథ్ సింగ్ లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దెవ చేశారు. బీజేపీ మొదటి నుంచి తెలంగాణ కు ఆగర్భశత్రువే అన్నారు.

తెలంగాణలో ఆరు మండలాలను ఆంధ్రలో కలుపడంతో పాటుగా, తెలంగాణకు న్యాయ బద్దంగా రావల్సిన నిధులు రాకుండా అడ్డుపడుతున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం బాగుందని పార్లమెంట్ లో ప్రధాని చెప్పింది నిజమో.. అభివృద్ధి జరగలేదని గల్లీలో బీజేపీ నాయకులు చెప్పింది నిజమో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమాధానం చెప్పాలన్నారు. స్కీంలతో తెలంగాణ దూసుకపోతుంటే..స్కాంలతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కురుక పోతుందన్నారు. 11 సార్లు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టిన చేయని పనులు 10 ఎండ్లలో సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. సిద్దిపేటలో మంగళవారం నిర్వహించే ప్రజాఆశీర్వాద సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపాల్ చైర్మన్ కడవేర్గు. రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత వేణుగోపాల్ రెడ్డి, నాయకులు దరిపల్లి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story