- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోంది: మంత్రి హరీష్ రావు
దిశ, ఝరాసంగం: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పరిధిలోని ఎల్గోయి గ్రామంలో నూతనంగా రూ.1.70 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆయన జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, కలెక్టర్ శరత్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. గత ప్రభుత్వాల హాయంలో అనేక సమస్యలు ఉండేవని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం అనేక సమస్యలను సీఎం కేసీఆర్ తీర్చారని తెలిపారు. మహిళలకు గృహలక్ష్మి పథకం ప్రారంభిస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు త్వరలోనే వడ్డీని జమ చేస్తామన్నారు. గ్రామంలో సర్వే నిర్వహించి ఇల్లు లేని పేద వారికి రూ.3 లక్షలు అందిస్తామని తెలిపారు.
యువత కోసం త్వరలోనే స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా గ్రామంలో అన్ని వర్గాల వారికి కమ్యూనిటీ భవనాలు నిర్మించుకునేందుకు స్థలం కొరకు సర్వే మ్యాప్ తయారు చేసి జనాభా ప్రాతిపదికన అందించాలని, లేఅవుట్ తయారు చేసి ఇళ్లు లేని వారికి స్థలాలు ఇప్పిస్తామని తెలిపారు. అంతకు ముందు మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ పాటిల్, సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్ లు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.