- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే మదన్ రెడ్డి
దిశ, కౌడిపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వెంకట్రావు పేట గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని, దృష్టి లోపం ఉన్నవారికి ప్రభుత్వం ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేస్తుందన్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజు నాయక్, సర్పంచ్ నజియా ఉన్నిసా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, వైద్యురాలు శ్రీలక్ష్మి, నాయకులు శివాంజనేయులు, అమర్ సింగ్, రాములు, నర్సింహులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.