ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేలా చర్యలు చేపట్టాలి : కలెక్టర్

by Kalyani |
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేలా చర్యలు చేపట్టాలి : కలెక్టర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఎల్ ఆర్ ఎస్ స్కీం లో ఫీజు జనరేట్ అయి, కట్టడానికి సిద్ధంగా ఉన్న వారి వివరాలను తెలుసుకొని సకాలంలో ఫీజు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ మను చౌదరి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ఎల్.ఆర్.ఎస్ డాక్యుమెంట్ అప్‌లోడ్, ఆన్ లైన్ డాటా ఎంట్రీ, ఎఫ్.టి.ఎల్. ప్రొహిబిటెడ్ ల్యాండ్ తదితర అంశాలపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్, అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పనులు మార్చి నెలాఖరు లోగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ప్రొహిబిటెడ్ ల్యాండ్ వివరాలను ఎంపీడీఓ లు గ్రామాల వారీగా తహశీల్దార్ల నుంచి తెప్పించుకొని స్పష్టత కలిగి ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు పునః పరిశీలించి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు.

గుత్తేదారు మధ్యలో ఆపేసిన పనులు ఆ ఇంటి యజమాని పూర్తి చేసుకోవడానికి ఆసక్తి చూపితే పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. అత్యంత పేదరికంలో ఉన్న వారికి జిల్లా లేదా మండల సమాఖ్యలు లేదా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి నిర్మాణాలను పూర్తి చేయించాలన్నారు. బేస్ మెంట్ వరకు పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లుల వివరాలు వెంటనే అప్లోడ్ చేయాలని, వాటికి చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో డీపీవో దేవకిదేవి, డీటీసీపీఓ వందనం, హౌజింగ్ పీడీ దామోదర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed