వైకుంఠపురంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు షురూ

by Javid Pasha |   ( Updated:2023-01-23 12:09:05.0  )
వైకుంఠపురంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు షురూ
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం (శ్రీ వైకుంఠపురం)లో దశమ వార్షిక శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం వైకుంఠపురం ఆలయంలోని మూలవిరాట్ అయిన శ్రీ వెంటేశ్వరస్వామికి ఉదయం నుంచి వేదపండితుల మంత్రోశ్చరణల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో ద్వారతోరణధ్వజ కుంభారాధన, అగ్ని ప్రతిష్ట, పెద్ద శేషవాహన సేవ, ధ్వజారోహణం (సంతానార్థులకు గరుడ ప్రసాదం వితరణ), దిక్పాలక బలిహరణం పూజలు జరిపారు.


సంతానం కలగని ఆడ వారికి అర్చకులు గరుడ ప్రసాదం వితరణ చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, దేవతాహ్వానం, చంద్రప్రభ వాహన సేవ, బాలిహరణం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


Advertisement

Next Story

Most Viewed