- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహ్... ఆవాలతో కేసీఆర్ "చిత్రం"
దిశ, ప్రజ్ఞాపూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రగతి సెంట్రల్ స్కూల్ లో 18 అడుగుల అతి భారీ చిత్రాన్ని 25 కిలోల ఆవాలతో రామకోటి రామరాజు చిత్రించారు. 5 రోజులు శ్రమించి కేసీఆర్ చిత్రాన్ని అత్యంత అద్భుతంగా చిత్రించి గురువారం ఆవిష్కరించాడు. శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు కేసీఆర్ చిత్రాన్ని ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆలోచనతో చిత్రిస్తానన్నాడు. గత 5సార్లు చిత్రించానని, వరి ధాన్యంతో ఒకసారి, బియ్యంతో ఒకసారి, సబ్బుబిళ్ల మీద, సునేరుతో ఒకసారి, 100కిలోల పసుపు బియ్యంతో ఒకసారి చిత్రించానని, ఈసారి అవాలతో రూపాన్ని అద్భుతంగా చిత్రించానని అభిమానులు తిలకించి మంత్రముగ్దులయ్యారన్నారు. రైతు బాంధవునిగా పేరు గాంచిన కేసీఆర్ రైతు పండించిన ఆవాలతో చిత్రించడం కొసమెరుపు కాగా, అభిమానుల సందర్శనార్థం మూడు రోజులపాటు ప్రగతి స్కూల్ లో ఉంచనున్నట్లు రామకోటి రామరాజు తెలిపారు.