- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇసుకతో భారీ శివలింగం... వాహ్.. నిజాంగా చాలా బాగుంది
దిశ, కంది: ఆ శివలింగాన్ని మీరు చూస్తే రెండు చేతులు పైకెత్తి భక్తి పారవశ్యంతో మనసారా ప్రార్థించే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. కేవలం స్వచ్ఛమైన ఇసుకతో తయారుచేసిన ఈ సైకత శివలింగాన్ని బుధవారం ఆవిష్కరించారు. సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులో గల జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో 19.5 అడుగుల భారీ సైకత శివలింగాన్ని రూపొందించారు. ఈ శివలింగం తయారీ కోసం 360 టన్నుల ఇసుకను మాత్రమే వాడడం విశేషం. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 9 నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు జ్యోతిర్ వాస్తు వ్యవస్థాపకుడు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. కాగా బుధవారం ఎంపీ బీబీ పాటిల్, గంగాపూర్ పీఠాధిపతి వల్లభానంద సరస్వతి ఇతర ప్రముఖులు ఈ సైకత శివలింగాన్ని ఆవిష్కరించడం జరిగింది. కాగా ఈనెల 18వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ అద్భుతమైన శివలింగాన్ని చూడడానికి భక్తులు పోటెత్తుతున్నారు.