Sangareddy Collector : మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

by Aamani |
Sangareddy Collector : మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
X

దిశ, సంగారెడ్డి : జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై పోలీస్ శాఖ, ఆబ్కారీ శాఖలతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నషా ముక్త్ భారత్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రేపటి సమాజ నిర్మాతలైన యువత డ్రగ్స్ మహమ్మారి భారిన పడకుండా కాపాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని, యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాలు, కుటుంబీకులు పొందే దుఃఖం వివరిస్తూ చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.

జిల్లాలో డ్రగ్ సంబంధిత సమాచారం ఉన్నట్లైతే జిల్లా ఎస్-న్యాబ్ 8712656777 కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు సూచించారు. ఎస్సీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి సాగు, అక్రమ రవాణా పై జిల్లా పోలీసు శాఖ ఉక్కు పాదం మోపుతూ, జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించడం జరుగుతుందన్నారు. డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడమే లక్ష్యంగా సంగారెడ్డి జిల్లా నార్కోటిక్ అనాల్సిస్ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి, ఎక్సైజ్ కమిషనర్ నవీన్ చంద్ర, డీఎం అండ్ హెచ్ఓ గాయత్రి దేవి, డీఈఓ వెంకటేశ్వర్లు, వివిధ విద్యా సంస్థలకు చెందిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed