Sangareddy Collector: అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

by Aamani |
Sangareddy Collector: అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
X

దిశ,సంగారెడ్డి : ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ప్రజలకు జవాబుదారీతనం గా ఉండడంతో పాటు సమయపాలన పాటించాలన్నారు. రెగ్యులర్ పనులతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను వేగవంతంగా జిల్లాలో అమలు చేయాలని అధికారులకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలని అన్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో రోడ్లు గుంతలు పడి ప్రమాదకరంగా తయారయ్యాయని, వెంటనే రోడ్ల మరమత్తు పనులు చేపట్టాలని పంచాయతీ రాజ్ ఆర్ అండ్ బీ శాఖల అధికారులను ఆదేశించారు.

మండల ప్రత్యేకాధికారులు వారంలో 4 రోజులు తప్పనిసరిగా వారి మండలాలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అంతకు ముందు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్ లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ఓ పద్మజారాణి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 55 ఫిర్యాదులను ప్రజలు సమర్పించారు .ఇందులో రెవెన్యూ కు సంబంధించి 33 రాగా మిగతా 22 వివిధ అంశాలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed