- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డయాలసిస్ సెంటర్ కు...మరో 5 పడకలు మంజూరు
దిశ, సిద్దిపేట ప్రతినిధి : కిడ్నీ వ్యాధి గ్రస్తులకు శుభవార్త. సిద్దిపేట డయాలసిస్ సెంటర్ కు మరో 5 పడకలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే 10 పడకల ద్వారా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సేవలు అందుతుండగా.. అదనంగా మరో 5 పడకలు మంజూరు కావడంతో కిడ్నీ వ్యాధి గ్రస్తులు వ్యయ ప్రయాసలు నుంచి ఉపశమనం లభించనుంది. సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోనే తొలి డయాలసిస్ సెంటర్ 2017 లో మొదట 5 పడకలతో ప్రారంభమైంది. తదనంతరం 2019 లో మరో 5 పడకలు మంజూరు చేశారు.
గడిచిన ఏడు సంవత్సరాలుగా డయాలసిస్ సెంటర్ లో 78 వేల మంది వ్యాధి గ్రస్తులకు ఉచితంగా వైద్య సేవలందించినట్లు రికార్డుల ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుత తరుణంలో కిడ్నీ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరుగుతుండటం.. మరో వైపు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లితే వైద్యం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకొని డయాలసిస్ సెంటర్ కు మరో 5 పడకలను మంజూరు చేయించారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వరం : మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు
డయాలసిస్ సెంటర్ కు మరో 5 పడకలు మంజూరు కావడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. త్వరలోనే సిద్దిపేట డయాలసిస్ సెంటర్ లో మరో 5 పడకల ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.