- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహాలక్ష్మి స్కీంతో మహా మోసం చేసిన రేవంత్ రెడ్డి
దిశ, చిన్నకోడూరు : కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీం పేరుతో మహిళలను మహా మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం రాత్రి చిన్నకోడూరు మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి స్కీము కింద మహిళలకు రేవంత్ రెడ్డి సర్కారు పదివేల రూపాయలు బాకీ పడిందన్నారు. తెలంగాణలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల కింద మహిళలకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారాన్ని అందిస్తానన్నా రేవంత్ రెడ్డి నేటి వరకు బంగారం లేదు లక్ష నగదు లేదని ఎద్దేవా చేశారు. రైతులకు క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్సు అందిస్తామన్న సర్కారు మార్కెట్లో ధాన్యాన్ని కూడా కొనడం లేదన్నారు.
ఓట్ల కోసమో సీట్ల కోసమో కాదని తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు. అబద్దాల కాంగ్రెస్ కు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలన్నారు. 420 హామీలతో రేవంత్ రెడ్డి చార్సో వ్ బీస్ గా మారాడున్నారు. కాలేశ్వరం నీళ్లు తెచ్చి రైతుల కష్టాలను తీర్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. దేశంలోనే రైతు విలువ భూముల విలువ పెంచిన ఘనత కేసీఆర్ దే అన్నారు. ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలిస్తే భూముల విలువ రైతుల విలువ తగ్గే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ మీద గట్టిగా కొట్లాడుతున్నాడని ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తే రెండు రోజులు ప్రచారం చేయొద్దు అని ఈసీ ఆదేశాలు ఇచ్చిందన్నారు. రెండు రోజులు ప్రచారం చేయకుండా ఆపుతారేమో
కానీ తెలంగాణ ప్రజల్లో గుండెల్లో నుండి విడదీయ లేదన్నారు. సంస్కారం లేని భాషతో రేవంత్ రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడు అన్నారు. కేసీఆర్ ను తిట్టడం అంటే తెలంగాణ ప్రజలను తిట్టడమే అన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణన్ శర్మ, మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, ఎంపీపీ మాణిక్య రెడ్డి, వైస్ ఎంపీపీ కీసర పాపయ్య, జంగిటి శ్రీనివాస్, మేడికాయల వెంకటేశం, ఇట్టబోయిన శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు పంపర్ కనకయ్య, నాయకులు పాల్గొన్నారు.