- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలను మానుకోవాలి: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
దిశ, నారాయణ ఖేడ్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలే ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో సోనియా గాంధీ దయ్యమని ప్రభోదించి, నేడు సోనియాగాంధీ దేవత ఎలా అయ్యిందంటూ ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో ఎమ్మెల్యే, ఎంపీ, గంపెడు మట్టి తీయకుండా రూ.కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని తెలిపారు.
కాంగ్రెస్ హయంలో నల్లవాగు ప్రాజెక్టు రూ.14కోట్లు, ఇరిగేషన్, ఇందిరమ్మ ఇళ్లు, అవినీతి జరిగిందని దీనికి రేవంత్ రెడ్డే సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ నిలిచిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నారాయణఖేడ్ లో ఆక్సిజన్ పార్కు, మార్కెట్ యార్డ్, నేషనల్ హైవే, డబల్ రోడ్లు, గ్రంథాలయాలను నిర్మించామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నజీబ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ బుజ్జి, ఎంపీపీ తనయుడు కర్ర రమేష్ చావన్, సర్పంచ్ లు సంజీవ్, ఉత్తమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.