- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిమాండ్ ఖైదీ పరారీ.. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన
దిశ, కంది: ఓ దొంగతనం కేసులో సంగారెడ్డి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. జైలు సూపరింటెండెంట్ భరత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చోరీ చేసిన కేసులో ఖమ్మం జైలులో శిక్ష అనుభవిస్తున్న సీహెచ్.అరవింద్ (22) అనే ఖైదీని గత నెల మొదటి వారంలో ఖమ్మం జైలు నుంచి సంగారెడ్డి జైలుకు తరలించారు. కాగా, సంగారెడ్డి జైలులో శిక్ష అనుభవిస్తున్న అరవింద్ 19న జైలులో ఇనుప మేకులను మింగాడు.
దీంతో అస్వస్థతకు గురైన ఖైదీని జైలు సిబ్బంది అదే రోజు ఏఆర్ పోలీసుల ఎస్కార్ట్ పర్యవేక్షణలో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరుసటి రోజు 20న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో అరవింద్ బాత్ రూంకి వెళ్తానని చెప్పి ఏఆర్ పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే తేరుకున్న పోలీసులు సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో సమాచారం అందజేశారు. వారి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని పరారైన ఖైదీ కోసం ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపట్టారు.
పరారైన ఖైదీ అరవింద్ గతంలో కూడా పలు దొంగతనాల కేసుల్లో నిందితుడుగా ఉండి శిక్ష అనుభవించగా, అతనిపై మొత్తం తొమ్మది దొంగతనాలకు సంబంధించి కేసులు ఉన్నాయని జైలు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇంతకు ముందు కూడా ఓ కేసులో కోర్టుకు తరలించే క్రమంలో పోలీస్ స్టేషన్ నుంచి ఈ విధంగానే పోలీసుల కళ్లుగప్పి పరారైనట్లు సమాచారం.