- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rain alert : జిల్లాకు మూడు రోజులు వర్ష సూచన
దిశ, సంగారెడ్డి : జిల్లాకు మూడు రోజులు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు భారీ వర్షాలు కురువనున్నాయని, 21వ తేదీన జిల్లాలో ఆరెంజ్ అలర్ట్, 22వ తేదీన ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.
గుమ్మడిదల మండలంలో నల్లవల్లిలో అత్యధికంగా 17.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే విధంగా గుమ్మడిదలలో 17 మిల్లీమీటర్లు, జిన్నారంలో 13.5 మి.మీ, ఆందోల్ మండలం అల్మాయిపేటలో 12.8 మిల్లీమీటర్లు, చౌటకూర్ లో 11.8, అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేట, హత్నూర మండలం గుండ్ల మాచునూర్ లో 11.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ లో 10.5, సిర్గాపూర్ , పటాన్ చెరు లో 10 మి.మీ, అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ లో 9.8 మి.మీ, రామచంద్రాపురం 9.3, నిజాంపేటలో 8.8, సిర్గాపూర్ కడ్పల్ 8.5, పుల్ కల్ 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
సంగారెడ్డిలో పోలీసు కంట్రోల్ రూం ఏర్పాటు..
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ ఆదేశాలతో జిల్లా ఎస్పీ పోలీసు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదం తలెత్తినా, అత్యవసర సమయంలో స్థానిక పోలీసు స్టేషన్ కు లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739 ను సంప్రదించాలని ఎస్పీ చెన్నూరి రూపేష్ సూచించారు. జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు కుంటలకు వెళ్లకుండా ప్రమాద
సూచిక బోర్డ్ లను ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. జిల్లా ప్రజలు అవసరమైతే తప్పా ఇండ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరించారు. రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, విద్యుత్ స్తంభాలను కానీ, వైర్లను కానీ చేతులతో తాకకకూడదని సూచించారు. నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లరాదని, వాగులు వంకలు బ్రిడ్జిలపై నుండి పొంగి, ప్రవహించే సమయంలో దాటడానికి ప్రయత్నించరాదని, పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల పక్కన నివాసం ఉండరాదని సూచించారు.
- Tags
- Rain alert