- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ పై అనర్హత వేటు.. అప్రజాస్వామికం: సీపీఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
దిశ, సిద్దిపేట ప్రతినిధి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నిరంకుశ పాలన సాగిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పై అనర్హత వేటు అప్రజాస్వామికం అని అన్నారు. సీబీఐ, ఈడీల పేరిట బీజేపీ అధినాయకత్వం ప్రతిపక్షాలను భయభ్రంతులకు గురిచేస్తోందన్నారు.
కార్పొరేట్ వ్యాపారుల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం తప్ప ప్రధాని మోదీ ప్రజలకు చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన తరుణం అసన్నమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై బీజేపీ హటావో దేశ్ కో బచావో పేరిట ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన స్ఫష్టం చేశారు. దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పడగొట్టిందని అరోపించారు. టీ.ఎస్.పీఎస్.సీ పేపర్ లీకేజీ ఘటనలో పారదర్శకత లోపించిందన్నారు.
ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరువ తీసుకొని నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశ వ్యాప్తంగా ఈడీ దాడులకు సీపీఎం వ్యతిరేకం కాదని, రాజకీయ కోణంలో జరిగే చర్యలకు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, పిట్ల మల్లేశం, చంద్రం సీపీఐ నాయకులు పాల్గొన్నారు. అనంతరం సీపీఐ నాయకుడు ధర్మభిక్షం 12వ వర్ధంతి వేడుకల్లో చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.