- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని వ్యాఖ్యలు వక్రీకరించారు: బీజేపీ
దిశ ప్రతినిధి, సిద్దిపేట: పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై భారత ప్రధాని మోడీ మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా ఉన్నాయంటూ టీఆర్ఎస్ బుధవారం రోజున జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ప్రధాని దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ నేతల నిరసనలకు ధీటుగా బీజేపీ అదే స్థాయిలో అధికార టీఆర్ఎస్ పై విరుచుకు పడింది. టీఆర్ఎస్ నేతలకు ధీటుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో వందలాది బీజేపీ కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం సిద్దిపేట పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ నిరసనను అడ్డుకోవడంలో భాగంగా పోలీసులు పలువురు బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును హైదరాబాద్ లోని తన ఇంట్లోనే హౌజ్ అరెస్ట్ చేశారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హౌజ్ అరెస్ట్..
బుధవారం రోజున జనగామ జిల్లాలో పలువురు బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ నాయకులు కర్రలతో కొట్టగా పలువురు నాయకులకు గాయాలయ్యాయి. దీన్ని నిరసిస్తూ చలో జనగామ కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హైదరాబాద్ తన స్వగృహం నుంచి బయలుదేరుతుండగా హైదరాబాద్ పోలీసులు అడ్డుకొని హౌజ్ అరెస్ట్ చేశారు. తాను జనగామ కి వెళ్లనని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గంలో పలు అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని చెప్పిన వినలేదు.
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాష్ట్ర డీజీపీ కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పోలీసుల తీరును నిరసిస్తూ తన ఇంటి ముందే కింద కూర్చోని ఎమ్మెల్యే నిరసన తెలిపారు. ఖాకి యూనిఫామ్ బదులు పింకీ డ్రెస్సులు కుట్టించుకోవాలని పోలీసుల ను ఉద్దేశించి అన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం.. శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు
ప్రధానమంత్రి ప్రసంగాన్ని టీఆర్ఎస్ వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. ఇది రాష్ట్ర ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని ప్రధాని స్పష్టంగా చెప్పారు. పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ సైతం తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపారన్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు మరువద్దు. ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ అవినీతి బండారాన్ని బహిర్గతం చేస్తూనే ఉంటామన్నారు.