- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుమ్మరి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి
దిశ, సిద్దిపేట ప్రతినిధి : రామాయణాన్ని సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ అని కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు దరిపల్లి శ్రీనివాస్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రాంచంద్రం అన్నారు. తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మొల్లమాంబ విగ్రహానికి కుమ్మరి సంఘం ప్రతినిధులు పూల మాలలతో నివాళులు అర్పించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.... మొల్లమాంబ జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలన్నారు. కుమ్మరి అభ్యున్నతి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో పెండింగ్‌లో శాలివాహన పైలేట్ ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించాలన్నారు. కుమ్మర కుల వృత్తి దారులకు రూ. 3 వేల పింఛన్ ఇవ్వాలన్నారు. బడ్జెట్‌లో కుమ్మరుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించాలన్నారు. గ్రామాల్లో కుల సంఘ భవనాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలాలతో పాటు నిధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం జిల్లా కోశాధికారి నాంపల్లి వెంకటేష్, ప్రతినిధులు రవీందర్, భూమయ్య, తిరుపతి, సాయిబాబా, బిక్షపతి, రమేష్, నాగరాజు, శ్రీనివాస్, భాగయ్య, కనకయ్య, నాంపల్లి, పర్షరాములు, నవీన్, కిష్టయ్య తదితర పాల్గొన్నారు.