- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొంగతనం కేసును చేధించిన పోలీసులు.. 13 తులాల బంగారం రికవరీ
దిశ , జహీరాబాద్ : బంగారు ఆభరణాల చోరీ కేసును జహీరాబాద్ పోలీసులు తక్కువ సమయంలో చేధించి ఉన్నతాధికారుల మన్ననలందుకున్నారు. ఈ కేసులో13 తులాల బంగారం ఆభరణాలను రికవరీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ సీహెచ్.రూపేష్ మీడియాతో మాట్లాడుతూ ఘటనవివరాలను వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న మహమ్మద్ ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ ఆయన భార్య ఇద్దరు వృత్తిరిత్యా ఉపాధ్యాయులు. గత తొమ్మిదవ తేదీన ఇంటికి తాళం వేసి స్కూలుకు వెళ్లిపోయారు. మధ్యాహ్న సమయంలో ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి అల్మారాలో దాచిన 2 తులాల బంగారు నెక్లెస్, 5 తులాల బంగారు హారం, 4 తులాల బంగారు మంగళసూత్రం, 2 తులాల ఆరు రింగులు మొత్తం 13 తులాలు దొంగిలించారు. పాఠశాల నుంచి తిరిగి వచ్చిన ఆ దంపతులు ఇంటికి తాళం విరగొట్టి ఉండడాన్ని గమనించి లోపలి ప్రవేశించి చూడగా అల్మారాలో నుంచి బంగారు ఆభరణాలు దొంగతనం అయినట్లు గుర్తించారు. వెంటనే జహీరాబాద్ పట్టణ పోలీసులు ఫిర్యాదు చేయగా ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేయగా, సీఐ బి రాజు దర్యాప్తు చేపట్టారు.
దొంగతనం జరిగిన స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేసి సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆదివారం ఉదయం దాబా వద్ద నేరస్థుడు ఉన్నట్లు సమాచారం అందుకుని పట్టుకున్నామన్నారు. దొంగతనానికి పాల్పడిన ఓ మైనర్ (సీసీఎల్ )నుంచి దొంగలించబడిన మొత్తం స్వాధీనం చేసుకుని దొంగతనానికి ప్రోత్సహించిన నిందితుడు పెద్దమ్మ రేఖ, ఆమె కుమారుడు ప్రేమ్ లు పరారీలో ఉన్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో కేసు చేదించి బంగారు ఆభరణాలను రికవరీ చేసిన పోలీసులను ఎస్పీ అభినందించి, రివార్డులు అందజేశారు. దీపావళి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలని, పూజల నేపంతో పేకాటను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృంధాలను ఏర్పాటు చేశామన్నారు. పేకాట ఆడుతూ పట్టుపడితే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటే 100ఒకటి నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీతో పాటు డీఎస్పీ. వీ.రఘు , సీఐ.రాజు, ఎస్ఐ. శ్రీకాంత్ ఇతర సిబ్బంది ఉన్నారు. ఎస్పీ చేతుల మీదుగా రివార్డులు అందుకున్నారు.