- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమికొట్టాలి : MLA Muthireddy Yadagiri Reddy:
దిశ, చేర్యాల : రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమికొట్టాలంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంటే కాంగ్రెసోళ్లు ఓర్వట్లేదని అన్నారు. వారి ప్రభుత్వం వస్తే ఉచిత కరెంట్ ను రద్దు చేసి కేవలం మూడు గంటల కరెంటు మాత్రమే ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం హాస్యాస్పదం అన్నారు. రేవంత్ కక్షపూరిత మాటల బట్టి ఆయనకు రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం..
చేర్యాల మండల కేంద్రంలోని స్థానిక గాంధీ సెంటర్ వద్ద నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రారంభించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని 18 నుంచి 39 సంవత్సరా లోపు యువతీ, యువకులంతా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వరూప రాణి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఎపీపీ కరుణాకర్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు పెడతాల ఎల్లారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంగొలు చంటి, బీఆర్ఎస్ నాలుగు మండలాల యూత్ ఇన్ చార్జిలు శివగారి అంజయ్య, మండల యూత్ అధ్యక్షుడు ఆకుల రాజేష్ గౌడ్, కోతి దాసు, ఎండీ నజీర్ తో పాటు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Read More: కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ: Minister Mallareddy