కాంగ్రెస్‌కు ఓటేసినందుకు కర్ణాటక ప్రజలు బాధ పడుతున్నారు

by Naresh N |
కాంగ్రెస్‌కు ఓటేసినందుకు కర్ణాటక ప్రజలు బాధ పడుతున్నారు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: కర్ణాటక రాష్ట్రంలో వ్యవసాయానికి 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలకృష్ణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ సెల్ జనరల్ సెక్రటరీ ఉడత. మల్లేషం, బజరంగదళ్ జిల్లా అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, తీన్మర్ మల్లన్న టీమ్ జిల్లా కన్వీనర్ మోత్కు సాయికుమార్, పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు స్వప్న తదితరలకు మంత్రి హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించి మాట్లాడారు. విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అన్నారు. మోస పురిత హామీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి 3గంటల కరెంట్ మాత్రమే సరఫరా చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందకు కర్ణాటక ప్రజలు బాధ పడుతున్నారని, కూట్లో రాయి తీయలేనోడు ఏట్లోని రాయి తీస్తడు అన్నచందాన కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. తాగు, సాగు, కరెంట్ కష్టాలను కేసీఆర్ తొలగించారన్నారు. ధాన్యం ఉత్పత్తిలో నేడు తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రైతు బీమా పథకం మాదిరి ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల బీమాను ప్రభుత్వం అందించబోతున్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. రేషన్ షాపులల్లో సన్నబియ్యం, సౌభాగ్య లక్ష్మి ద్వారా మహిళలకు రూ. 3వేలు అందించబోతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పథకం అందని ఇల్లు లేదు అభివృద్ధి మీ కంటి ముందే కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story