- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాజిక సేవలో పారగాన్ పరిశ్రమ సేవలు ప్రశంసనీయం
దిశ, పటాన్ చెరు: సామాజిక సేవలో పారగాన్ పరిశ్రమ సహకారం ప్రశంసనీయమని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ మార్క్స్ కాలనీలో పారగాన్ పరిశ్రమ ఆర్థిక సహకారంతో నిర్మించిన అంగన్వాడి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అత్యంత నిరుపేదలు నివసించే మార్క్స్ కాలనీలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఆధునిక సౌకర్యాలతో భవనాలు నిర్మించడం పట్ల పరిశ్రమ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్ళలో పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రభుత్వం అందించే నిధులతో పాటు వివిధ పరిశ్రమల సహకారంతో ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. పాఠశాలలో గ్రంథాలయం పుస్తకాల కోసం సొంత నిధులు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అఫ్జల్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, బండ్లగూడ అధ్యక్షులు గోపాల్, పరిశ్రమ డైరెక్టర్ సిద్ధార్థ్, ప్రతినిధులు బిను, శ్రీజిత్, మల్లేష్ యాదవ్, చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.