- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జూనియర్ పంచాయతీ కార్యదర్శులది న్యాయమైన డిమాండే : టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
దిశ కొండపాక : పంచాయతీ కార్యదర్శులది న్యాయమైన కోరికేనని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎదుట తమ నాయ్యమైన కోరికలను నేరవేర్చాలని కోరుతు పంచాయితీ కార్యదర్శలు చేపట్టిన నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరింది. మంగళవారం వారి సమ్మేకు టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులది న్యాయమైన కోరికేనని నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగానే వెంటనే వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
మిగతా పార్టీల వారితో చర్చించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. పంచాయతీకి కార్యదర్శుల సమ్మెకు సంఘీభావంగా హుస్నాబాద్ మండలం చెందిన పంచాయతీ కార్యదర్శి శృతి భర్త వచ్చి సమ్మెకు సంఘీభావంగా రూ.10వేలు అందజేశారు. అనంతరం వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చిన టెర్మినేషన్ నోటీసు గడువు సాయంత్రం ఐదు గంటలు గడచినా.. ఎవరూ విధులకు హాజరుకాకపోవడం గమనార్హం.