- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కష్టాలు అధిగమించి… ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి
దిశ, ఝరాసంగం : పేద మధ్య తరగతికి చెందిన యువతకు ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక పెద్ద కల. ఎన్ని సమస్యలు ఎదురైనా ఉద్యోగ సాధన క్రమంలో సమస్యలను అధిగమించి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గ్రామీణ యువతకు పెద్ద సవాలు. అలాంటి కష్టాలు ఎన్ని ఎదురైనా, అవంతరాలు అధిగమించి 2024 డీఎస్సీలో పేద మధ్య తరగతి, వ్యవసాయ ఆధారిత కుటుంబానికి చెందిన వారు పరీక్షలు రాసి వారి ప్రతిభ నిరూపించుకున్నారు. ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించిన 61 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించగా. సంగారెడ్డి జిల్లాలో 397 మంది నియమితులయ్యారు.
వారిలో ఎస్జీటీలు 285, ఎస్ఏలు 91,మంది స్కూల్ అసిస్టెంట్లు, 15 మంది తెలుగు పండిత్, 6 పీఈటీలు ఉద్యోగాన్ని సాధించారు. ఈ నెల 9న ప్రత్యేక బస్సులు హైదరాబాద్ తరలించి సీఎం రేవంత్ రెడ్డి చేతుల నియామక పత్రాలను అందజేశారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా నూతన ఉపాధ్యాయులు వారి కేటాయించిన పాఠశాలలో విధులకు హాజరయ్యారు. వారికి ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. నూతన ఉపాధ్యాయులుగా నియమితులైన వారి వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందగా ఉత్సవాలను జరుపుకున్నారు.
కార్యదర్శికి రాజీనామా చేసి
రాయికోడు మండలం సింగితం గ్రామానికి చెందిన ఎం వినయ్ కుమార్. 2019లో జూనియర్ పంచాయతీ సెక్రెటరీగా ఎన్నికై కొన్ని రోజులు విధులు నిర్వహించి రాజీనామా చేసి డిఎస్సి కి ప్రిపేర్ అయ్యాడు. ఎన్ని అవంతరాలు ఎదురైనా వాటిని అధిగమించి 2024 డిఎస్సి ఫలితాలలో ఉత్తీర్ణమి సాధించి ఉపాధ్యాయులయ్యారు. వీరివి వ్యవసాయ ఆధారిత కుటుంబం.
కూలి బిడ్డ పుష్పమ్మ
ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన పుష్పమ్మ ప్రాథమిక విద్య బర్దిపూర్, కుప్పా నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత చదువు చదివి ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తూ 2014 డీఎస్సీలో ఉత్తమ ఫలితాలు సాధించి స్కూల్ అసిస్టెంట్ గా నియమితులయ్యారు. కంగ్టి పాఠశాలల్లో విధులకు హాజరయ్యారు. వీరి తండ్రి మారుతి తల్లి పద్మమ్మ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
వ్యవసాయం చేస్తూ ఉద్యోగం సాధించాడు
రాయికోడ్ మండలం రాయి పల్లి గ్రామానికి చెందిన ధనరాజ్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం రాకపోవడంతో తల్లిదండ్రులతో పాటు వ్యవసాయం చేస్తూ 2024 డిఎస్సి లో ఉత్తీర్ణత సాధించి కర్చల్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఎస్ జి టి బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థుల ఉత్తమ బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తానని ధనరాజ్ అన్నారు.