ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి..

by Vinod kumar |
ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి..
X

దిశ, చిన్నకోడూరు: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రాముని పట్ల గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. చిన్నకోడూర్ ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర గర్చోలి జిల్లాకు చెందిన త్యావాన్ నాకు దేవ్ (40) అదే జిల్లాకు చెందిన కృష్ణ ఇరువురు ట్రాక్టర్ తీసుకుని రోడ్డు పనులు చేస్తున్నారు.


అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడగా.. త్యావాన్ నాకు దేవ్ అక్కడికక్కడే మృతిచెందగా కృష్ణ కు తీవ్ర గాయాల అయ్యాయి. దీంతో 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్న కోడూర్ ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story