- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పార్కు స్థలాన్ని సర్వే చేసిన అధికారులు
దిశ కథనానికి స్పందన
దిశ, సంగారెడ్డి: సర్వే నెం.374/1లో పార్కు స్థలం ఆక్రమణ జరిగిందంటూ దిశ ప్రరచురించిన కథనానికి అధికారులు స్పందించారు. మార్చి 8న ప్రజలు సేద తీరేందుకు వదిలిన పార్కును కొందరు ఆక్రమార్కులు కబ్జా చేశారని దిశ కథనం వెలువరించిన విషయం పాఠకులకు విదితమే. 1980లో సంగారెడ్డిలోని రెవెన్యూ కాలనీకి ఆనుకుని ఉన్న సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కాలనీ కోసం అప్పటి కలెక్టర్ సర్వే నెం.374/1లో 2 ఎకరాల 20 గుంటల భూమిని కేటాయించారు. అందులో 50 ప్లాట్లు చేసి మిగిలిన కొంత భూమిని పార్కుకు వదిలేశారు.
కానీ, కొందరు పార్కుకు కేటాయించిన స్థలానికి బై నెంబర్ వేసి ఆరు ప్లాట్లు చేసి దర్జాగా రిజిస్ర్టేషన్ చేసుకున్నారని కాలనీ వాసులు ఫిర్యాదు చేయగా ఆ తతంగాన్ని దిశ వెలుగలోకి తీసుకువచ్చింది. కథనానికి స్పందించిన కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ల్యాండ్ రికార్డ్స్ ఎంప్లాయిమెంట్ కాలనీని సర్వే చేసి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో శనివారం సర్వే ల్యాండ్స్ అధికారులు కాలనీకి వచ్చి పూర్తిగా సర్వే చేశారు. కాలనీకి కేటాయించిన రెండు ఎకరాల 0గుంటల భూమిలో మరో 10 గుంటల భూమి అదనంగా ఉన్నాట్లు గుర్తించారు.
అయితే, ఆ భూమి 374/1 సర్వే నంబరుదేనా లేక మరేదైనా సర్వే నంబర్ కలిసిందా అనే దానిని డిజిటల్ సర్వే ద్వారా నిర్దారణ చేసి కలెక్టర్ కు నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు. కాగా ఆ 10 గుంటల భూమి పార్కుకు వదిలిందేనని దానిని కాపాడాలని కాలనీ వాసులు కోరుతున్నారు. అదనంగా ఉన్న 10 గుంటల భూమి కొందరూ మాదంటే మాదంటూ అధికారులను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఆ భూమిని పార్కుకు కేటాయించాలని కోరారు.