- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బరువు రాదు... ధర లేదు.. పత్తి రైతు పరేషాన్
దిశ, ఝరాసంగం : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, రైతులు తీవ్రంగా నష్టపోతు అప్పుల పాలవుతున్నారు. పెట్టిన ఖర్చులు రాకపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఖరీఫ్ సీజన్లో పెసర, మినుము, కంది, పచ్చ జొన్న, మొక్కజొన్న, నువ్వులు, పత్తి తదితర పంటలు వేశారు. సీజన్ ప్రారంభంలో పంటలకు సరిపడి వర్షాలు కురిశాయి. దీంతో పంటలపై రైతులకు ఆశలు చిగురించాయి. పంట చేతికొచ్చే సమయానికి భారీ వర్షాలు కురవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. సీజన్ సాగులో భాగంగా అత్యధికంగా పత్తి పంటనే సాగు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ పంట కోత సమయంలో పక్షం రోజులు భారీ వర్షాలు కురిశాయి.
దీంతో పత్తి అరకొరగా చేతికి వస్తుంది. పత్తి పంట ఎకరాకు సుమారుగా 10 క్వింటాలు దిగుబడి అని రైతులు ఆశించారు. కానీ ఎకరాకు మూడు లేదా నాలుగు క్వింటాల మాత్రమే రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల్లో వర్షానికి పత్తి నీట మునిగి ఏలూరు కుళ్ళిపోయి పంట చేతికి చేతికి రాకుండా పోయింది. పత్తి వర్షానికి తడిసి ఎండలకు ఉండడంతో బరువు రావడం రావడంలేదని ఝరా సంగం, కప్పా నగర్, బర్దిపూర్, ఎల్గోయి, దేవరంపల్లి తదితర గ్రామాల రైతులు అన్నారు. పత్తి బరువు రాక కోతకు కూలీలు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. పంట చేతికొచ్చేసరికి సుమారుగా రూ. 35 వేలు రైతుకు ఖర్చవుతుంది. పంట చేతికి వచ్చినప్పటికీ కూలీలు దొరకకపోవడంతో కొంతమంది రైతులు పంటను పొలంలోనే వదిలేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 6.96 లక్షల ఎకరాలు వివిధ పంటలు సాగులో ఉండగా అందులో 3.90 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేస్తున్నారు. 2024-25 సంవత్సరానికి సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తికి మద్దతు ధర ప్రకటించింది. పొడుపు గింజ రకానికి రు.7,521, పొట్టి గింజ రకానికి 7,121 నిర్ణయించింది. క్వింటాలు పై రూ.501 పెరిగింది. ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్లో పత్తి ధర రూ. 7 వేలు పలుకుతుంది. పంటకు పెట్టుబడులు పెరగడంతో దిగుబడి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర పదివేలు ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.