- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్కర్ స్కాంలో ఎవ్వరిని వదిలిపెట్టం : ప్రభు చౌహన్
దిశ, అందోల్: రాష్ట్రంలో కేసీఆర్ హాటావో..తెలంగాణ బచావో’ అనే నినాదంతో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జిల్లా బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ కర్ణాటక ఎమ్మెల్యే ప్రభు చౌహన్ అన్నారు. శుక్రవారం జోగిపేటలోని వాసవి కల్యాణ మండపంలో అందోలు నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో నిరుద్యోగులను గాలికొదిలేశారని, కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రం ఉన్నతమైన పదవులు దక్కాయన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఎప్పటికి ఒక్కటి కావని, రాజకీయంగా శత్రువులేనన్నారు. దళిత బంధు, బీసీ, మైనార్టీ బంధు, డబుల్ బేడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేసిన లబ్దిదారుల లెక్క చెప్పాలన్నారు. రాష్ట్రంలో హత్యలు, హత్యచారాలు, దోపిడీలు, భూకబ్జాలు ఎక్కువయ్యాయన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివద్ధి చెందుతుందన్నారు. జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి పి. బాబూమోహన్ మాట్లాడుతూ.. ప్రజలకు మాయ మాటలు, అబద్దాలు చెప్పి కేసీఆర్ గద్దెనెక్కారన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండని అన్ని విధాలుగా అభివృద్ది చెందుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, బీఆర్‌ఎస్‌కు వేసినట్లేన్నారు. 24 గంటల పాటు ఉచిత కరెంటు పేరుతో దోపిడికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ఇంచార్జ్ రంగారెడ్డి, ఓబీసీ మోర్చ రాష్ట్ర సభ్యుడు చంద్రశేఖర్, నాయకులు కొత్త శ్రీనివాస్, జగన్నాథం, వని రమేష్, సుమన్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
కవితను లిక్కర్ స్కామ్ నుంచి బయట వేసేందుకు బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటయ్యాయంటూ జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని ప్రభు చౌహన్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్‌లో ఉన్నట్లు అభియోగాలు ఉన్నాయని, ఈ విషయంలో న్యాయ పరమైన విచారణ జరుగుతుందన్నారు. నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని, స్కామ్‌లో ఉన్నవారందరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్ విషయం కూడా పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు.