- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగన్వాడీ సెంటర్లలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌లు వద్దు
దిశ, సంగారెడ్డి : అంగన్వాడీ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తూ అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బీరం మల్లేశం డిమాండ్ చేశారు. సోమవారం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, సీఐటీయూ యూనియన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి, అనంతరం ఐసీడీఎస్ పీడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీరం మల్లేశం మాట్లాడుతూ…. అంగన్వాడీ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తూ అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. గత 24 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడి తో పాటు మే నెలంతా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్‌కు ఇద్దరికీ ఒకేసారి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చామన్నారు. సమ్మె అనంతరం ఈ సమస్యను పరిష్కారం చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.
ఈ అంశాలను కొత్త ప్రభుత్వానికి సంబంధిత మంత్రికి, అధికారులకు అనేక సార్లు తెలియజేశామన్నారు. అయిన ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చేయలేదన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకుండా అంగన్వాడీ ఉద్యోగులను పట్టించుకోకుండా అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌లు పెట్టాలనుకునే నిర్ణయం మానుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి కె.రాజయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్, జిల్లా సహాయ కార్యదర్శి మహిపాల్, విద్యాసాగర్, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి మంగ, జిల్లా అధ్యక్షులు శశికళ, అధ్యక్షుడు ఏసు మనివ, నాయకులు బాబురావు, సతీష్ తదితర అంగన్వాడీ టీచర్స్, ఆయాలు పాల్గొన్నారు.