కన్నీరు పెట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు (వీడియో)

by S Gopi |   ( Updated:2023-04-13 17:31:53.0  )
కన్నీరు పెట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు (వీడియో)
X

దిశ, ఝరాసంగం: అయ్యో బిడ్డ ఇక నువ్వు ఎప్పటికీ కానరావా..? అంటూ తల్లి విమలమ్మ గుండెలు బాదుకుని రోదిస్తుంటే ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అయ్యో కొడకా నేను నీకు కొరివి పెట్టబడితిని కదరా.. తండ్రి వైద్యనాథ్ పుత్రశోకంతో కుమిలి పోతూ ఉంటే చూసినవారికి కన్నీటి దారలు ఆగలేదు.. పిల్లలకు ఏమి చెప్పి వెళ్ళవయ్యా అజయ్ అంటూ భార్య స్రవంతి గుండెల మీద బాదుకుంటూ చేసిన రోదనతో ఒక్కసారిగా మాచునూరు ప్రజలు, బంధుమిత్రులు దుఃఖంలో మునిగిపోయారు.ఝరాసంగం మండలంలోని మాచునూర్ గ్రామానికి చెందిన మనీగారి అజయ్ కుమార్(30) సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో అజయ్ కుమార్ కు గుండె నొప్పి రావడంతో జహీరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. వెళ్లిన 15 నిమిషాల్లో అజయ్ కుమార్ కు హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడికక్కడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో అప్పటివరకు తమతో కలిసి మెలిసి ఉన్న అజయ్ కుమార్ మృతి చెందిన వార్త మచునూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కొంతకాలం అజయ్ కుమార్ జహీరాబాద్ పట్టణంలో కిరాణం షాపు నడిపించారు. అనంతరం తమ సొంత గ్రామం మాచునూర్ లో హోల్ సేల్ కిరాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.దరితో స్నేహశీలిగా ఉండే అజయ్ మరణవార్త విన్న జహీరాబాద్, ఝరాసంగంలోని పలు గ్రామాల స్నేహితులు, బాల్య మిత్రులు, బంధుమిత్రుల రాకతో మరింత శోకసంద్రంలో మునిగిపోయింది మాచునూర్. అజయ్ కుమార్ అత్యక్రియలకు సుమారుగా రెండు రెండు వేల మందికి పైగా హాజరయ్యారు అంటే ఆయన ఎంత స్నేహితులుగా ఉండేవారు అర్థమవుతుంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు తన షెడ్యూల్ ప్రకారం ఉన్న కార్యక్రమాలను సైతం రద్దు చేసుకుని అజయ్ కుమార్ అంత్యక్రియలకు హాజరయ్యారు. అజయ్ కుటుంబానికి ఆదుకుంటామని ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ఆయన సైతం ఒకానొక దశలో కన్నీరు పెట్టుకున్నారు. అజయ్ కుమార్ అంత్యక్రియలు రాత్రి 10 గంటలకు ముగిశాయి. కాగా అజయ్ కుమార్ కుమారులు రిక్కీ, రిషి, తన తండ్రిపై మట్టి వేయొద్దని రోదించడంతో అక్కడున్న వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు.

Advertisement

Next Story

Most Viewed