బీజేపీలో చేరినోళ్లకు బెదిరింపులా..మంత్రి హరీష్‌పై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

by Aamani |   ( Updated:2023-09-30 12:31:51.0  )
బీజేపీలో చేరినోళ్లకు బెదిరింపులా..మంత్రి హరీష్‌పై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్
X

దిశ,దుబ్బాక : ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కును కాలరాసే విధంగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని, బీజేపీలో చేరినోళ్లను బెదిరించడమేంటని, ఇలా బెదిరించడం మీ పార్టీ విధానం జిల్లా మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. శనివారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అక్బర్పేట-భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన ఆయా పార్టీలకు చెందిన 50 మంది యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో చేరే కుటుంబాలకు బీసీ బంధు, దళిత బంధు. మైనార్టీ బంధు, రేషన్ కార్డు రాదని బీఆర్ఎస్ నాయకులు బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్ పెట్టిన బీజేపోడు వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతారని అబద్ధాలు మీటింగ్ పెట్టిన బీజేపోడు వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు జరిగి మూడేళ్లైనా రాష్ట్రంలో ఎక్కడైనా మోటార్లకు మీటర్లు పెట్టారో నిరూపించాలని మంత్రికి సవాల్ విసిరారు.

కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఉచిత హామీలను మరిచిపోవడానికే ప్రతిపక్షాలపై అసత్య ప్రచారాలు చేస్తుందని, అబద్ధాలెప్పుడు నిజాలు కావని, నిజాలెప్పుడు అబద్ధాలు కావని, ప్రజలెప్పుడు గమనిస్తున్నారని తెలిపారు. హరీష్ రావు చెప్పే పిట్ట కథలు, మాయ మాటలను దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తేల్చి చెప్పారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మోటార్లకు మీటర్ల ముచ్చట బంద్ చేసి గత పదేళ్లలో ప్రజలకిచ్చిన హామీలను ఏ ఒక్కటైనా అమలు చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని కేసీఆర్ ప్రభుత్వానికి ఆయన సూచించారు. దళితున్ని సీఎం చేస్తానని చేయనట్టు, అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని ఇయ్యనట్టు, దళిత బంధు ఇస్తానని ఇయ్యనట్టు, బీసీ బంధు ఇస్తనని ఇయ్యనట్టు, పెన్షన్లు మంజూరు చేస్తామని చేయనట్టు తీపి కబురు కేసీఆర్ ప్రభుత్వం చెప్పబోతుందని ఎద్దేవా చేశారు.

ఇతర పార్టీల్లోకి వెళ్తున్న కార్యకర్తలకు సంక్షేమ పథకాలు రావని, బీఆర్ఎస్ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు వర్తిస్తాయని బెదిరిస్తున్న బీఆర్ఎస్ నాయకుల ప్రచారంపై కుల, మతాలకు, పక్షపాత వైఖరి, రాగద్వేషాలకు తావివ్వబోమని, అన్ని వర్గాలకు సమ న్యాయం తో చూస్తానని అసెంబ్లీలో ప్రమాణం చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు వైఖరి వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దుబ్బాకలో సిలిండర్ పేలి బిల్డింగ్ ధ్వంసమైన కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వినాయక మండపంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేష్ గౌడ్, మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు సిష్టమ్మ గారి సుభాష్ రెడ్డి,మండల అధ్యక్షుడు అంబటి శివప్రసాద్ గౌడ్, విభీషణ్ రెడ్డి, మంద అనిల్ రెడ్డి, అరిగె కృష్ణ, మచ్చ శ్రీనివాస్, పుట్ట వంశీ, గాజుల భాస్కర్, సుంకు ప్రవీణ్. మాధవనేని భాను ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed