- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సర్కార్ దవాఖానల పై ప్రజలకు పెరిగిన నమ్మకం..
దిశ, మెదక్ ప్రతినిధి : సర్కార్ దవాఖానల పై ప్రజలకు నమ్మకం పెరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తన మనవడికి మెదక్ పట్టణంలోని మాత శిశు సంరక్షణ కేంద్రంలో టీకా ఇప్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు గతంలో ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యలకు నిలయంగా ఉండేవన్నారు. దాంతో ప్రజలు ఆ ఆసుపత్రులకు వచ్చేందుకు జంకే వారని గుర్తు చేశారు. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఆసుపత్రుల స్థాయి పెంచడంతో పాటు కోట్లాది రూపాయలు వెచ్చించి అత్యాధునిక యంత్రాలు, పరికరాలు సమకూర్చారు.
డాక్టర్, స్టాఫ్ పోస్టులు భర్తీచేశారని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా అన్ని హంగులతో మాత శిశు సంరక్షణ కేంద్రలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్ లకు ధీటుగా ఉన్న ఎంసీహెచ్ లకు ఆదరణ బాగా పెరిగిందని, మెరుగైన వైద్య సేవలతో పాటు కేసీఆర్ కిట్, రూ.12,000 నగదు సాయం అందిస్తుండటం వల్ల వీటిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీశ్ రావ్ బాధ్యతలు తీసుకున్న తరువాత మెదక్ జిల్లాలో ప్రభుత్వ పరంగా వైద్య సేవలు మెరుగు పరచడం పై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో ఐసీయూ, డయాలసిస్ సెంటర్, డయాగ్నోసిస్ హబ్, ఆక్స ప్లాంట్ వంటి సౌకర్యాలు అందుబాటులో కి వచ్చాయని, అన్ని రకాల చికిత్స లు జరుగుతున్నాయని గుర్తుచేశా రు. ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వుని యోగం చేసుకోవాలని కోరారు. ఈ దేవేందర్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెడెంట్ చంద్ర శేఖర్, శివ దయాళ్ తో పలు పలువురు ఉన్నారు.