- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Kotha Prabhakar Reddy : పల్లెలకు కేసీఆర్ జీవం పోస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణం తీస్తుంది
దిశ,దుబ్బాక : గత తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసి బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులో పెట్టాం అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ అన్నారు. 2014 కు ముందు గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలు తిరిగి చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో నిధులు అన్ని సిద్దిపేట,గజ్వేల్, సిరిసిల్ల జిల్లాకే పోతున్నాయని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు నేడు కాంగ్రెస్ పాలనలో నిధులన్ని సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ కు,నల్గొండ జిల్లాకు,మధిర,ఖమ్మం జిల్లాకు నిధులను మళ్లిస్తలేరా.! వేల కోట్ల నిధులను తీసుకెళ్లి మీ నియోజకవర్గాలలో అభివృద్ధి చేసుకుంటున్నారు కదా అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ పంచాయతీల అభివృద్ధికి నూతన జవ జీవాలు అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం శీత కన్ను వేసిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.అసెంబ్లీలో బడ్జెట్ పై జరిగిన చర్చలో గ్రామీణాభివృద్ధి పై మాట్లాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణాల తరహాలో గ్రామీణాభివృద్ధి కి పెద్ద ఎత్తున నిధులు కేటాయించగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల్లో కొత విధించడం జరిగిందన్నారు.మీరు గ్రామీణ అభివృద్ధి తిరోగమనం కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు.కేసీఆర్ హయాంలో కేరళ తరహాలో కేవలం 4 ఏళ్లలో గ్రామాల్లో ట్రాక్టర్ లు ఏర్పాటు చేసి చెత్త సేకరణ, డంపింగ్ యార్డు, నర్సరీలు, స్మశాన వాటికలు, వాటర్ ట్యాంక్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.తెలంగాణ సరిహద్దు లో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, లలో ఉన్న గ్రామాలను ఒక్కసారి చూసి రావాలన్నారు.
నాడు సిద్దిపేట, గజ్వెల్, సిరిసిల్ల లను బాదునాము చేసి,నేడు కొడంగల్, మధిర, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు నిధులు తీసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.సీఆర్ఆర్ రోడ్లకు రూ, 720 కోట్లు కేటాయించారని, పాత బకాయిలు రూ,1100 కోట్లు ఉన్నాయని వారికి ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. గ్రామాల్లో పందులు, కుక్కల, దోమల బెడద తీవ్రంగా ఉందని మాజీ సర్పంచ్ లకు చెల్లింపులు లేవని కార్యదర్శులు జేబులో నుండి ఖర్చు పెట్టుకుంటున్నారన్నారు.మేము గతంలో మంజూరు చేసుకున్న నిధులను రద్దు చేయడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ తో ఎన్నికల హామీలలో గ్రామీణాభివృద్ధి గురించి హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. గ్రామాల్లోకి వెళితే రూ,4వేల పించిన్ ఎక్కడ అని మహిళలు అడుగుతున్నారన్నారు. కేసీఆర్ తెలంగాణ పల్లెలను అభివృద్ధి చేసి బంగారు పళ్లెం లో పెట్టి మీకు అప్పగిస్తే ఆగం చేశారని విమర్శించారు.