Mission Bhagiratha: భగీరథ నీటి దోపిడీకి కుట్ర.. పరిశ్రమకు మల్లుతున్న భగీరథ నీరు..

by Mahesh |   ( Updated:2022-09-03 12:49:52.0  )
Mission Bhagiratha: భగీరథ నీటి దోపిడీకి కుట్ర.. పరిశ్రమకు మల్లుతున్న భగీరథ నీరు..
X

దిశ, మనోహరాబాద్: గ్రామంలోని నివాస గృహాలకు సరఫరా చేసే పైప్ లైన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పరిశ్రమకు మిషన్ భగీరథ తాగు నీరును దోపిడీ చేసి సరఫరా చేసుకోవడానికి యజమానులు చేస్తున్న కుట్రలకు సంబంధిత అధికారులు యజమానులతో కుమ్మక్కై అనుమతులు ఇవ్వడం ఏమిటని గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. నీటిని సరఫరా చేసుకోవడానికి వ్యవసాయ పొలాల మధ్య నుంచి వేస్తున్న పైప్ లైన్ పనులను రైతులు అడ్డుకున్న సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో చోటు చేసుకుంది.

గ్రామ శివారులో ఉన్న మహాలక్ష్మి ప్రొఫైల్ లిమిటెడ్ స్టీల్ పరిశ్రమకు గ్రామంలోని పోచమ్మ దేవాలయం వద్ద ఉన్న పైప్ లైన్ నుండి వ్యవసాయ పొలాల మధ్యలో ఉన్న పానాది మీదుగా సిండికేట్, సాయి సూర్య వెంచర్ల మార్గం నుండి పరిశ్రమకు పైప్ లైన్‌ను పరిశ్రమ యజమానులు నిర్మాణం చేపట్టారు. మార్గ మధ్యంలో ఉన్న పొలాల రైతులు తమ పానాది స్థలం నుంచి పైప్ లైన్ ఎలా వేస్తారని పనులను అడ్డగించారు. కాగా గ్రామానికి సరఫరా అయ్యే తాగు నీరు పూర్తి స్థాయిలో ప్రజలకు సరఫరా కావడం లేదని దీంతో తాగు నీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు.

పరిశ్రమకు నీటిని సరఫరా చేసుకోవడానికి ఏకంగా నాలుగు ఈంచుల వెడల్పు ఉన్న పైప్‌ను వేయడంతో నీరంతా పరిశ్రమకే తరులుతుందంని, ఇక ఇండ్లకు సరఫరా అయ్యే నీటికి విఘాతం కలుగుతుందని ప్రజలు వాపోతున్నారు. ముక్యంగా పరిశ్రమలకు నీటిని సరఫరా చేయడానికి ప్రత్యేకంగా పైప్ లైన్ వేయాలే తప్ప, ఇలా నివాస గృహాలకు సరఫరా అయ్యే పైప్ లైన్ నుండి నీరు ఎలా సరఫరా చేస్తారని స్థానికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఈ విషయమై మిషన్ భగీరథ గ్రిడ్ డీఈ. నాగార్జున ను వివరణ కోరగా తాగునీటి కోసం పరిశ్రమ యజమానులు భగీరథ సంస్థకు డిపాజిట్ చెల్లించడంతో తాము అనుమతులు ఇచ్చామన్నారు. కానీ పైప్ లైన్ నిర్మాణం పరిశ్రమ యజమానులే చేపడుతున్నారని ఆయన వివరించారు.

Advertisement

Next Story