చిరకాల స్వప్నం నెరవేరడం సంతోషం.. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

by Sumithra |
చిరకాల స్వప్నం నెరవేరడం సంతోషం.. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
X

దిశ, మెదక్ ప్రతినిధి : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో మెదక్ కు మెడికల్ కళాశాలను తీసుకు వచ్చామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు అన్నారు. బుధవారం మెదక్ మెడికల్ కలశాల మంజూరి సందర్బంగా పీల్లికొటాలలో ఉన్న తాత్కాలిక మెడికల్ కళాశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పరిశీలించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం పక్కన నిర్మించనున్న శాశ్వత మెడికల్ కాలేజీ భవన నిర్మాణ స్థలాన్ని జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏ బ్లాక్, సి బ్లాక్ భావనాలను, సమకూర్చిన, ఫర్నిచర్, పరికరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలోనే మెడికల్ కాలేజీ మంజూరు అయిందన్నారు. జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరిన వేళ వైద్య విద్యకు న్యాయం జరిగిందని అన్నారు. జిల్లాలో యువత ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారు కావాలని ఆకాంక్షించారు. ఎన్నో అవాంతరాల తర్వాత ఎట్టకేలకు మెదక్ మెడికల్ కాలేజ్ మంజూరి చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు జిల్లా కలెక్టర్ కు, అధికారులకు మెదక్ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. నర్సింగ్ కళాశాల, మెడికల్ కళాశాల ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే సూచించారు.

జిల్లా అభివృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని స్పష్టం చేశారు. అనంతరం పీల్లికొటాలలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మెడికల్ కళాశాల భూమిని పరిశీలించి భవన నిర్మాణాలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా పునర్విభజనలో భాగంగా మెదక్ ప్రత్యేక జిల్లా అయినా కూడా అంత అభివృద్ధి చెందలేదని జిల్లా అభివృద్ధిలో విద్యా, వైద్యం సౌకర్యాలు మెరుగు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు. వైద్య కళాశాల మంజూరు కావడం దీని వెనుక విశేష కృషి చేసిన జిల్లా మంత్రివర్యులు, శాసనసభ్యులు, హెల్త్ సెక్రెటరీ , ధన్యవాదాలు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యాధికారులు ఉండడం స్థానికంగా ఉండి పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని వైద్య కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న మెడికల్ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ శివ దయాల్, తహశీల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వార్డ్ కౌన్సిలర్లు, వివిధ ప్రభుత్వ అధికారులు , మెడికల్ కళాశాల సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed