- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామిక వేత్త.. టికెట్ పక్కా ఆయనకేనా!
దిశ, సంగారెడ్డి బ్యూరో: కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఐలేని జయరాంరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన ఫార్మా కంపెనీల అధినేత జయరాంరెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు ఇదే పార్లమెంట్ పరిధిలో ప్రాతినిథ్యం వహిస్తున్న నేపథ్యంలో ఆ స్థానం అభ్యర్థి ఎంపికపై అధికార కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీసీ నాయకుడు నీలం మధు ముదిరాజ్ ఇద్దరిలో ఒకరికి అవకాశం కల్పించే అవకాశముందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో పలు దఫాలు చర్చలు జరిపిన తరువాత జయరాంరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఓకే చేసినట్లు, అధికారికంగా ఆయన పేరు ప్రకటించాల్సి ఉన్నదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మెదక్ పార్లమెంట్ పరిధిలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మెదక్‌లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించగా మిగతా ఆరు స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీని బలంగా దెబ్బకొట్టడానికి బలమైన అభ్యర్థిని అధికార పార్టీ బరిలో దింపుతున్నదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
ముగ్గురు అన్నదమ్ములు పారిశ్రామికవేత్తలే..
మందపల్లి గ్రామానికి చెందిన జయరాంరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, వెంకట్రాంరెడ్డిలు ముగ్గురు అన్నదమ్ములు. విజయ్ ఎక్స్‌ప్లొజివ్స్(గ్రానైట్ పేల్చే మందుగుండు) వంటి కంపెనీతో పాటు తులసీ ఆసుపత్రి, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఫార్మా కంపెనీల అధినేతగా జయరాంరెడ్డి ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఆయన ఎంపిక బాగుంటుందని జిల్లా నేతలు అధిష్టానానికి సూచనలు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.