- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గొంతు కోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
దిశ, చేగుంట: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా గొంతు కోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. గొల్లపల్లి గ్రామానికి చెందిన నరసింహ చారి కోళ్ల ఫారాల షెడ్లు వేసే పనులు చేస్తుంటాడు. మిరుదొడ్డి మండలం అందె ప్రాంతంలో కోళ్ల ఫారాల షెడ్లను ఇటీవల నిర్మించగా దానికి సంబంధించిన యజమాని రూ. 1,50,000 తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. డబ్బుల కోసం పదేపదే నరసింహచారికి ఫోన్లు చేయగా మంగళవారం అందె గ్రామానికి వెళ్ళాడు.
కోళ్ల ఫారం షెడ్డు నిర్మాణ విషయమై ఇతర షెడ్ల యజమాలతో సైతం మాట్లాడించినప్పటికీ డబ్బు విషయంలో ఇబ్బంది కలగచేయడంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా రెండు సంవత్సరాల క్రితం తన పెద్ద కుమారుడు చెరువులో పడి మృతిచెందగా, కుటుంబంలో సైతం చిన్నచిన్న కలహాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గొల్లపల్లి గ్రామ శివారులో చాకుతో గొంతు కోసుకొని, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి వరకు నరసింహ చారి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ సర్పంచ్ ఎల్లారెడ్డికి తెలిపారు. దీంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న నరసింహ చారిని గుర్తించి చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు సర్పంచ్ ఎల్లారెడ్డి తెలిపారు.