మన్నేవార్ జలాల్పూర్ చెరువులో చిరుత పులి పాదాల ఆనవాళ్లు..

by Sumithra |
మన్నేవార్ జలాల్పూర్ చెరువులో చిరుత పులి పాదాల ఆనవాళ్లు..
X

దిశ, వెల్దుర్తి : మండలంలోని మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని ఓ చెరువులో చిరుతపులి పాదాల ఆరవాళ్లు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గ్రామ సమీపంలోని సంగారెడ్డి చెరువులో చిరుతపులి పాదాలున్నట్లు రైతులు గుర్తించారు. చెరువులో పశువులకు నీళ్లను తాగించేందుకు వెళ్లిన రైతులు కొత్తరకం పాదాల ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం కుకునూరు గ్రామంలో చిరుతపులి పశువుల పై దాడిచేసిన వీడియోలు వైరల్ కావడంతో ఇవి చిరుతపులి పాదాలేనని రైతులు తెలిపారు ఇటీవల.

శంషారెడ్డిపల్లి తండాలో చిరుతపులి పశువుల పై దాడి చేయగా పశువులు చనిపోయాయి. ఈ విషయమై అటవీ శాఖకు సమాచారం అందించగా పరిశీలించిన అధికారులు పశువుల పై దాడి చేసింది చిరుతపులి కాదని హైనా అని ప్రకటించారు. ఈ క్రమంలో జలాల్పూర్ గ్రామ చెరువులో పులిపాదాల ఆడవాళ్లు కనబడడంతో ఒక్కసారిగా జలాల్పూర్ కుక్కునూరు గ్రామాల ప్రజలు రైతులు భయాందోళనలు గురవుతున్నారు. నిత్యం రాత్రి వేళల్లో పొలాల వద్దకు రాకపోకలు కొనసాగిస్తుంటామని, అటవీశాఖ అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పొలాల్లో సంచరిస్తున్న చిరుత పులిని బంధించి తమప్రాణాలు కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed