- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగలితో ఆకుపచ్చని చరిత్రను లిఖించిన నేత సీఎం కేసీఆర్: మంత్రి హరీష్ రావు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: చరిత్రను కొందరు సిరాతో, మరికొందరు రక్తంతో రాస్తే.. సీఎం కేసీఆర్ రైతు నాగలితో కాళేశ్వరం సిరాను ఉపయోగించి ఆకు పచ్చని చరిత్రను లిఖించారని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. విజయం సాధింస్తే విక్టరీ అని.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తే హిస్టరీ అవుతోందన్నారు. సీఎం కేసీఆర్ కు హిస్టరీలు కొత్త కాదని తెలంగాణ ఉద్యమం కోసం పార్టీని స్థాపించి, ఎమ్మెల్యే, పార్టీ పదవులకు రాజీనామా చేసి చరిత్ర సృష్టించారని మంత్రి అన్నారు. కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటుగా, 11 రోజుల అమర నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆరేనని అన్నారు. రానే రాదన్న తెలంగాణ ను సాధించి.. కానే కాదన్న కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందించడంతో పాటుగా, తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు సీఎంగా ఎన్నికైన సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని మంత్రి పేర్కొన్నారు.