- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
దిశ, మిరుదొడ్డి: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో తొగుట మండలంలోని పలు గ్రామాలలో రోడ్డు మరమ్మత్తులు ప్రారంభించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెట్టు నుండి ఎల్లారెడ్డిపేట, తుక్కాపూర్, తొగుట రాంపూర్, వాగుగడ్డ, చందాపూర్ మీదుగా గజ్వేల్ వెళ్లే రోడ్డు పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా రూ. నాలుగున్నర కోట్లతో 13 కిలో మీటర్లు రోడ్డును వేయిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో బీఆర్ఎస్ 8 సంవత్సరాల నుండి అధికారంలో ఉండి తట్టెడు మట్టి కూడా పోయలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన రెండు సంవత్సరాలలోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు అని తొగుట మండల బీజేపీ అధ్యక్షుడు చిక్కుడు చంద్రం అన్నారు.
సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లాగా తమకు కూడా రోడ్లు కావాలి అని అసెంబ్లీలో ప్రశ్నించి, ఈరోజు దుబ్బాక నియోజకవర్గంను అద్దంలా తయారు చేస్తున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నట్లు మేమే ప్రొసీడింగ్లు ఇచ్చినం అంటారు మరి ఈ తొమ్మిదేళ్ల పాలనలో మీరెందుకు చేయలేదు అని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. ఏది ఏమైనా తొగుట మండలంలో పలు గ్రామాలకు రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు. అన్ని రోడ్లు పూర్తి చేస్తానని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన ఎమ్మెల్యేగా పేరు నిలబెట్టుకున్నారు అని అన్నారు.