- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిశ’ఎఫెక్ట్.... గాయత్రీ లీలలకు చెక్
దిశ, సంగారెడ్డి: ‘గాయత్రీ లీలలు.. గాలిలో మేడలు’.. కథనంపై అధికారులు సీరియస్‌గా స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ జరిపి అనుమతులు లేవని నిర్ధారించిన తరువాత గాయత్రీ సంస్థ ఏర్పాటు చేసిన హోర్డింగ్, బోర్డులు, ఫ్లెక్సీలు తొలగించారు. సదాశివపేటలో పరిధిలో పెద్ద ఎత్తున రియల్ వ్యాపారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సదాశివపేట మండలం చందాపూర్ గ్రామంలో గాయత్రీ ఇన్ ఫ్రా డెవలపర్స్ సంస్థ డీటీసీపీ, రేరా ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు భారీ స్థాయిలో హోర్డింగ్, బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆఫర్లు కూడా ప్రకటించారు. 30 ఎకరాలు భూమి కొనుగోలు చేసిన సంస్థ 200 ఎకరాల్లో వెంచర్ వేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నది. రూ. కోటి పెట్టబడి పెడితే రూ. కోటితోపాటు అదనంగా మరో రూ. 50 లక్షలతోపాటు 1600 గజాల స్థలం ఇవ్వనున్నట్లు ఆఫర్లు పెట్టారు. విషయం తెలుసుకుని జరుగుతున్న వ్యవహారాన్ని ‘దిశ’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీనితో అధికారులు స్పందించి అన్ని బోర్డులు తొలగించారు. అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని గ్రామపంచాయతీ కార్యదర్శి నరసింహరెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి సూచనలతో తొలగించినట్లు చెప్పారు.