- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత జిల్లాను అభివృద్ధి చేయని కేసీఆర్..: రఘునందన్ రావు
దిశ, పాపన్నపేట : భారాస పదేళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ తన సొంత జిల్లాను పట్టించుకున్న పాపాన పోలేదని, ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రం అభివృద్ధిలో వెనుకబడే ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. మెదక్ ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా సోమవారం అమ్మవారి క్షేత్రానికి వచ్చి వనదుర్గామాతను దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు శంకర్ శర్మ, మురళి శర్మ, ఆలయ పాలకమండలి చైర్మన్ బాలాగౌడ్ రాజగోపురం నుంచి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఏడుపాయల క్షేత్రానికి రాకతో భాజపా మండల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అమ్మవారి క్షేత్రానికి చేరుకున్నారు. అనంతరం ఈవో కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ దర్శన్ స్కీం ద్వారా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమాత క్షేత్రాన్ని శాశ్వత పనులతో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.
క్షేత్రంలో శాశ్వత పనులు చేయకుండా తాత్కాలిక పనులు చేసి కాంట్రాక్టర్లను కాపాడుకోవడం తప్ప గత ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో తన సొంత జిల్లాలో ఉన్న ఏడుపాయల క్షేత్రాన్ని అభివృద్ధి చేయకపోవడం బాధాకరమన్నారు. 1999లో మెదక్ ఎంపీగా ఆలే నరేంద్ర హయంలో ఏడుపాయల క్షేత్రంలో త్రాగునీటి ఎద్దడి తీర్చారన్నారు. భారత ప్రధాని మోడీ నాయకత్వంలో దేవాలయాల అభివృద్ధి చేయడానికి ప్రసాద్ దర్శన్ ఏర్పాటు చేశారన్నారు. ఏడుపాయల్లో శాశ్వత పనుల కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, చైర్మన్ బాలాగౌడుకు సూచించారు. ప్రతిపాదనలు అందిన వెంటనే ప్రసాద్ దర్శన్ స్కీం ద్వారా పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పరిణిత, జిల్లా మహిళా అధ్యక్షురాలు వీణ, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, బీజేవైఎం నాయకులు నరేష్, పెంటయ్య, వెంకటేశం తో పాటు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.