మే 8న వెంకటరామిరెడ్డికి మద్దతుగా కేసీఆర్ రోడ్ షో

by Nagaya |
మే 8న వెంకటరామిరెడ్డికి మద్దతుగా కేసీఆర్ రోడ్ షో
X

దిశ,పటాన్ చెరు : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మెదక్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా మే 8న పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, డివిజన్ల నుండి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు రోడ్ షోకు హాజరు కాబోతున్నట్లు తెలిపారు.

గత పదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులను చూపెడుతూ ప్రజల ముందుకు వెళుతున్నామని, ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. మెదక్ గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డా అని, రికార్డు మెజార్టీతో వెంకట్రామిరెడ్డిని గెలిపించుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా.. కేసీఆర్ రోడ్ షో జరగనున్న ఇస్నాపూర్ చౌరస్తాను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ పరిశీలించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ ఎంపీపీ దేవానందం, ముత్తంగి మాజీ సర్పంచ్ ఉపేందర్, ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు ప్రభాకర్ గుప్త, మెరాజ్ ఖాన్, సందీప్, శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ, అబేద్, తులసి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed