- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకు వెళ్లడం పక్కా
దిశ,మద్దూరు : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకు వెళ్లడం పక్కా అని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మద్దూరులో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని, ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ తప్పకుండా చేస్తామని అన్నారు. ఎంపీగా తనని పార్లమెంటుకు పంపాలని, కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చి మద్దూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.
ఎన్నికల్లో మాట ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మద్దూరు ను అభివృద్ధి చేయకుండా కేసీఆర్ వెంట తిరుగుతున్నాడని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 30 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జైలుకు పోవడం తప్పదని అన్నారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పది సంవత్సరాలలో వేలకోట్లు దోచుకున్నది కేసీఆర్ కుటుంబం అని అన్నారు. తెలంగాణ బిల్లును పాస్ చేపించిన వ్వక్తినని అన్నారు. చేర్యాలను నెలరోజులలో డివిజన్ చేస్తామని, డి లిమిటేషన్ లో చేర్యాలను నియోజకవర్గం చేస్తామని అన్నారు. జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ
గత ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచారని, అయినా నైతిక విజయం నాదేనని అన్నారు. ఎంపీగా చామల కిరణ్ ను గెలిపిస్తే కేంద్రం నిధులతో ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం, జెడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, మండల అధ్యక్షులు మేక మల్లేశం, మహిళా మండల అధ్యక్షురాలు గుండెగోని లలిత మల్లేశం, మండల ప్రధాన కార్యదర్శి ఊట్ల శ్రీధర్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కామిడి రమేష్ రెడ్డి, జిల్లా నాయకులు మారెళ్ల భాస్కర్ రెడ్డి, జక్కిరెడ్డి సుదర్శన్ రెడ్డి, ఆరిఫ్, మండల నాయకులు జీవన్ రెడ్డి, కనక చంద్రం, కార్యకర్తలు పాల్గొన్నారు.