- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ బాకాసురుడు : రేవంత్ రెడ్డి
దిశ, సిద్దిపేట ప్రతినిధి: కేసీఆర్ బకాసురుడు అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో భాగంగా బుధవారం గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డికి మద్దతుగా ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ చరిత్ర మొత్తం పారిపోవుడే అని..సిద్దిపేట నుంచి కరీంనగర్‌కు, మహబూబ్‌నగర్ కు పోయాడన్నారు. చివరికి గజ్వేల్ ప్రజలు రెండు సార్లు గెలిస్తే మల్లన్న సాగర్‌లో ప్రజలను నిండా ముంచిండు, కొండపోచమ్మ సాగర్‌లో దోచుకున్నాడు, రంగనాయక సాగర్‌లో ప్రజలకు అన్యాయం చేసిండని మండిపడ్డారు. గజ్వేల్ ప్రజలు ఓడగొట్టేందుకు సిద్దం కావడంతో కామారెడ్డికి పారిపోయిండన్నారు.
కేసీఆర్ కాశ్మీర్, కన్యాకుమారి, శంకరగిరి మాన్యాలు పోయిన గజ్వేల్ ప్రజలు వదలరని ఓడగొడతారని జోష్యం పలికారు. 10 సంవత్సరాలుగా ప్రజలను గోస పెడుతూ, ప్రాజెక్టుల పేరిట రైతుల భూములు తీసుకొని ఫాంహౌస్ కు సాగునీరు తరలించుకున్న కేసీఆర్‌ను ఓడించి పొలిమేర వరకు తరమాలని పిలుపునిచ్చారు. ఓడితే ఫాం హౌస్‌లో పడుకుంటా అనుకుంటున్న కేసీఆర్‌ను ఇడ్చుకొచ్చి దోచుకున్న లక్షకోట్లను వసూలు చేయడంతో పాటుగా, హైదరాబాద్ చుట్టూ పక్కల అక్రమించుకున్న 10 వేల ఎకరాల భూములను బాజాప్తా గుంజుకుంటామన్నారు. కేసీఆర్ తింటే బకాసురుడు..పంటే కుంబకర్ణుడు అన్నారు. కొడంగల్ లో కేసీఆర్ తన పై ఇష్ట మొచ్చినట్లు మాట్లాడిన కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో..మందేసి మాట్లాడుతున్నాడో తెలువదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేయడంతో పాటుగా కేసీఆర్ బొందపెడితే వచ్చే నెల నుంచి ఫెన్షన్ రూ.5వేలు అందిస్తామన్నారు. బీఆర్ఎస్‌ను ఓడించడానికి సీపీఐ, జనసమితి అండగా నిలిచారన్నారు.
Read More..
మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ సినీ నటి